యాదగిరిగుట్టలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పులిగిల్ల బాలరాజు ఎంతో శ్రమించి శక్తికి మించిన కృషికి ఫలితంగా లోటస్ టెంపుల్ నిలుస్తున్నది. ఇంద్రలోకం, రుతువులు, ఆదిపరాశక్తి కొలువుదీరిన స్వర్ణలోకం తదితర లోకాలను కళ్లకు కట్టినట్లు రూపొందించడంలో శిల్పి రాజేందర్ చూపిన చొరవ ప్రశంసనీయం. ఇక్కడ నామమాత్రపు రుసుముతో దర్శనం చేసుకునే అవకాశం ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్యుల కర్తవ్యదీక్ష కోసం యాదగిరిగుట్టలో నిర్మించిన లోటస్ టెంపుల్ గుట్టకే తలమానికమైంది. ఒకటి కాదు…రెండు కాదు ఏకంగా రూ. 9 కోట్లు వ్యయంతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 12 వేల మంది మంది దాతల నుంచి రూ. 6 కోట్లను వసూలు చేసి ఖర్చు చేశారు. యాదగిరిగుట్టకు లక్ష్మీనరసింహుడు ఎంత వైభవాన్ని తీసుకొచ్చారో ఆర్యవైశ్య జాతికి లోటస్ టెంపుల్ ద్వారా అంతపేరు వచ్చింది. ఆర్యవైశ్య నిత్యాన్న సత్ర సంఘం అధ్యక్షుడు పులిగిల్ల బాలరాజు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
అద్భుతం లోటస్ టెంపుల్
