విద్యుద్దీపాలంకరణలో మత్య్సగిరిగుట్ట
శ్రీయాదాద్రి ప్రతినిధి :
ఉగాది : ప‌్రతి నూతన తెలుగు సంవత్సరాది (ఉగాది) రోజున గట్టుపైన శ్రీ స్వామి వారికి కార్యక్రమం గట్టు కింద దేవాలయంలో వేదపండితులతో పంచాంగశ్రవణం జరిపి శ్రీ స్వామి వారి సేవా కార్యక్రమాలు జరుపుతారు.
శ్రీరామనవమి : ప‌్రతి సంవత్సరం చైత్ర నవమి రోజున ఈ దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
శ్రీనృసింహ జయంతి : ప‌్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శ్రీ నృసింహ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.
శ్రీ వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు : ప‌్రతి సంవత్సరం జేష్ఠ్య పౌర్ణమి మాసంలో శ్రీ వెంకటేశ్వ స్వామి వారి బ్రహ్మోత్సవాలు వెంకటాపురం గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
శ్రీ హనుమాన్ జయంతి : ఈ దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ ఆంజనేయస్వామి వారికి జయంతి సందర్భంగా విశేషంగా అభిషేకములు, ఆకుపూజలు నిర్వహిస్తారు.
శ్రీ కృష్ణాష్టమి : ఈ దేవాలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున విశేష పూజలు నిర్వహింస్తారు. సాయంకాలం ఉట్ల పండుగ జరుపుతారు. అనంతరం స్వామి వారి సేవా కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
గణేష్ నవరాత్రులు : ఈ దేవాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.