శ్రీయాదాద్రి ప్రతినిధి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి శుక్రవారం లక్షతులసీ పుష్సార్చనను కన్నుల పండువుగా నిర్వహించారు. ఏకాదశి కావడంతో శ్రీవారికి లక్ష పుష్పాలతో కొలుస్తూ అపురూపంగా పూజాకైంకర్యాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు బట్టర్ సురేంద్రాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం శ్రీలక్ష్మీనరసింహునికి లక్షపుష్పార్చనను ఘనంగా నిర్వహించారు. లక్షపుష్పాలతో శ్రీవారిని కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకాదశి రోజున లక్ష పుష్పార్చనను ఆనవాయితిగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, ఆలయ ఏఈఓ వేముల రామ్మోహన్, ఏఈఈ ఊడెపు వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్‌లు గజ్వేల్ రమేష్‌బాబు, గజ్వేల్ రఘు, సండ్ర మల్లేష్, సింహయ్య, బాలాజి తదితరులు పాల్గొన్నారు.


