శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి గర్భాలయం ముందు ప్రహ్లాదుని చరిత్ర ఘట్టాలను బొమ్మల లిపిలో ఆవిష్కారం చేయనున్నారు. వాస్తు శాస్త్ర శిల్ప నిపుణులు చిన్న చిన్న బొమ్మల రూపంలో చెక్కుతున్నారు. గర్భాలయ ముందు భాగంలో జయ – విజయ – ద్వారపాలకులను ప్రతిష్ట చేయనున్నారు.
ఆలయంలో భక్తులు ఇలా…
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పశ్చిమవైపు గోపురంలో నుంచి ఆలయంలోకి ప్రవేశించి ఈశాన్యం వైపు గల త్రితల రాజగోపురం గుండా నేరుగా కిందికి దిగి శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం శ్రీవారి గర్భాలయంలో శ్రీవారిని దర్శించుకుంటారు. గతంలో మాదిరిగానే పాతపద్ధతిలో దర్శన ఏర్పాట్లు ఉండనున్నాయి.
పుష్కరిణి
పుష్కరుడు నివసించే స్థలం పుష్కరిణి. స్వామి వారికి ఈశాన్యదిశలో సంప్రదాయ పద్ధతిలో గతంలో ఎలా ఉన్నదో అదేవిధంగా పుష్కరిణిని విశాలంగా అభివృద్ధి చేస్తున్నారు. పుష్కరిణి మధ్యలో నాలుగు స్తంభము గల రాతిశిల స్తంభములు, కింద పీఠము, పైభాగంలో ఏకతల విమాన గోపురం అందంగా నిర్మాణం చేయడానికి డిజైన్లు ఖరారయ్యాయి.
ముఖమండపంలో ఆళ్వార్లు

యాదాద్రి ప్రధానాలయ ముఖమండపంలో పెరియాళ్వర్, పొమ్‌గైళ్వార్, భూదత్ ఆళ్వార్, మధురకవి ఆళ్వార్, తిరుమంగైయ్ ఆళ్వార్, తిరుపాన్ ఆళ్వార్, నంమ్ ఆళ్వార్, పేమ్ ఆళ్వార్, కులశేఖర ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్ భార్య కుముదవళ్లి, తొందరపూడి ఆళ్వార్, ఆండాల్‌దేవి. నారాయణ సేవలో తరించిన భక్తులు ఆళ్వార్లు. వీటిలో ఎన్నో జాతులు కలిగినవారు స్వామి వారికి సేవలు చేసినవారే. శ్రీరంగనాధుని ఆలయ పునర్నిర్మాణానికి, తిరుమంగై ఆళ్వార్ భక్తుల నుంచి అపహరించిన డబ్బులతో భగవంతుని ఆలయం నిర్మించారు. శ్రీనారాయణమూర్తిని పలు రకాలుగా సేవించిన భక్తులు, స్వామిపై కవితలు, పాశురాలు రాశారు. పెరియాళ్వర్ స్వామి వారికి తులసిమాలలను రోజు సమర్పించేవారు. శ్రీరంగనాధుని సేవలో మునిగితేలిన భక్తుడు. పిల్లలు లేని కారణం చేత స్వామికి రోజు పూజలు చేస్తూ గడిపేవారు. ఒకరోజు తులసివనంలో గోదాదేవి(ఆండాళ్ అమ్మవారు) లభించింది. దైవకళ ఉట్టిపడుతున్న పాపను పెంచి పెద్ద చేశాడు. కళ్యాణదశకు రాగాను పెళ్లి చేసేందుకు పెరియాళ్వార్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆండాళ్ అమ్మవారు శ్రీరంగనాధుని తప్ప ఎవరిని పెళ్లి చేసుకొనని మొండిపట్టు పట్టింది. గర్భాలయంలో ఉన్న విగ్రహాంతో ఎలా పెళ్లి చేయాలని ఆలోచిస్తాడు. గ్రామపెద్దలు మంచి ముహూర్తం నిశ్చయించి అమ్మవారిని పెళ్లికూతురుగా చేసి తులసిమాలతో శ్రీస్వామి వారికి మెడలో వేసేందుకు లోపలికి వెళ్లింది. ప్రజలందరూ చూస్తుండగా ఆండాళ్ దేవి స్వామి వారిలో లీనమైపోయింది. అది చూసిన భక్తులందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. రోజు స్వామి వారికి తులసిమాలను తయారు చేసి తండ్రికి ఇచ్చి పంపిన గోదాదేవి స్వామిలో ఐక్యం కావడం విశేషం. ఈ విశేషాలను వర్ణించేందుకు ముఖమండపం వేదికగా నిలిచింది. సమస్త వైష్ణవ ప్రచారాన్ని ఆవిష్కృతం చేశారు.
అంటరానివారిని అక్కున చేర్చుకున్న శ్రీమహావిష్ణువు
అంటరానివారిని సైతం తన భక్తులుగా స్వీకరించి శ్రీమన్నారాయణుడు ఆళ్వార్లకు వరాలు ఇచ్చారు. శ్రీమన్నారాయణుడి విశిష్టతలను ప్రపంచానికి చాటి చెప్పినవారు శ్రీరామానుజులు. విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రజలను భక్తిమార్గంలో నడిపిన ముఖ్యమైన ఆచార్యులు. కావున వారి విగ్రహాం కూడా స్తంభములో చెక్కబడి ఉంది. ఇవికాకుండా యాదమహర్షి, ప్రహ్లాదుడు, శ్రీ ఆంజనేయస్వామి వార్లు నమస్కరించు విధంగా అందముగా విగ్రహాలు చెక్కబడి ముఖమండపంలో దర్శనమిస్తాయి.
యాదాద్రి ముఖమండపంలో ఉపాలయాలు
యాదాద్రి ప్రధానాలయ ముఖమండపంలో శ్రీరామానుజులు, ఆండాళ్ అమ్మవారు, ఆళ్వార్లు మొదలైన ఏకతల విమానంతో కృష్ణశిలలను ఉపయోగించి అందంగా నిర్మాణం చేపట్టారు.
గర్భాలయం – ముఖమండపం
కిందిభాగంలో అన్ని కూడా శిలలతో ఫ్లోరింగ్ చేయనున్నారు. ఎదురుగా ఉన్న పంచతల రాజగోపురం లోపల ఇరువైపుల మెట్లను నిర్మాణం చేయనున్నారు. స్వామి మండపం పైకప్పులో అందంగా ఉండేవిధంగా వెడల్పు గల పద్మములు సాంప్రదాయ శిల్పపద్దతిలో తయారు చేయనున్నారు. ఏదీ ఏమైనా అందమైన రూపురేఖలు తయారు చేయడంలో ఆర్కిటెక్టు ఆనందసాయి డిజైన్ ఇవ్వగా స్తపతి ఎస్.సుందరరాజన్‌తో ఆమోదించబడి నిర్మాణం జరుగుతున్నది. ఇందులో స్తపతి డాక్టర్ ఆనందాచార్యుల వేలు కూడా నిర్మాణంలో పాల్గొని శ్రమిస్తున్నారు. వారితో శిల్పకాంట్రాక్టర్లు, ఉప సహాయ స్తపతులు, శిల్పులు అందరూ రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారు.
చిన్నజీయర్‌స్వామి సూచనలు…సీఎం కార్యదీక్ష
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజా శ్రీమన్నారాయణ చిన్నజీయర్‌స్వామి వారి విలువైన సూచనలతో పాటు సీఎం కేసీఆర్ కార్యదీక్ష యాదాద్రి ఆలయ అభివృద్ధికి బాటలు వేస్తున్నవి. ఆలయ రూపకల్పనలో శిల్పశాస్త్ర ప్రకారంగా పాంచరాత్ర పద్దతిలో గర్భాలయ నిర్మాణం, ముఖమండప నిర్మాణం, ఆళ్వార్ల మండపం, వాటిపైన కాకతీయ స్తంభాలు, ఒక్క స్తంభంతో నాలుగు పిల్లస్తంభాలు, స్తంభంలో లతలు, పుష్పాలు, ఏనుగులు, హంసలు, వివిధ రకాల మృగాలు అందులో చెక్కబడి ఉన్నాయి. ప్రధమ ప్రాకారం కాథరాతి నిర్మాణాలు అందంగా ఉంటాయి.
సాలాహరములు
లోపల ప్రాకారం గాని వెలుపల అష్టభుజి మండపంపైన సాలహారం ఏర్పాటు చేయనున్నారు. అందులో దశవతరాలు, వైష్ణవ రూపాలు మొదలైనవి అందులో ప్రతిష్ట చేయనున్నారు.