హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి, ఆగస్టు 5
- నిర్మలా సీతారామన్‌కు టీఆర్ఎస్ లోకసభ పక్షనేత నామ లేఖ –
స్కూల్ బస్సులకు నెలవారీ ఇన్సూరెన్స్ వెసులుబాటు కల్పించాలి
- ప్రైవేటు యాజమాన్యలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసిన ఎంపీ నామ నాగేశ్వరరావు
న్యూఢిల్లీ : కోవిడ్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రైవేటు విద్యా సంస్థలను ఆదుకోవడం కోసం ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ ప్రైజెస్ ( సీజీటీఎంఎస్ఈ ) పథకంలో చేర్చాలని టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత , ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు కోరారు . ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను ఆదుకోవాలని కోరుతూ గురువారం ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్ర ఆర్ధిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు . కోవిడ్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా చాలా రంగాలు నష్టపోయన్నారు . కోవిడ్ వల్ల ప్రైవేటు పాఠశాలలు దాదాపుగా మూతపడే దశలోకి నెట్టబడ్డాయని తెలిపారు . ఒకటిన్నర సంవత్సరాలుగా ప్రైవేటు పాఠశాలలు నడవడం లేదన్నారు . దేశవ్యాప్తంగా 4.5 లక్షల పాఠశాలలు ఉన్నాయి . ప్రైవేటు పాఠశాలలు 95 శాతం అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయన్నారు . పాఠశాలలు నడవక పోవడంతో పాఠశాలల యాజమాన్యాలు అద్దెలు చెల్లించడం , బోధన , బోధనేతర సిబ్బందికి జీతాలను చెల్లించ లేక పోతున్నాయన్నారు . ప్రైవేటు పాఠశాలలు నడకవ పోవడంతో సుమారు 5 కోట్ల మంది జీవనోపాధి ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు . కనీసం ప్రైవేటు పాఠశాలల బస్సుల ఇన్సూరెన్స్ లు చెల్లించ లేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు . ప్రైవేటు బస్సులకు ఏక మొత్తంలో ఇన్సూరెన్స్ లు చెల్లించే విధానంలో కాకుండా నెలవారీగా చెల్లించే విధంగా మినహాయింపులు ఇవ్వాలని కోరారు . 20 కోట్ల మంది విద్యార్థులకు విద్యాబుద్ధలు నేర్పుతున్న ప్రైవేటు విద్యా సంస్థలను సానుభూతితో ఆదుకోవాల్సిన బాధ్యత మనపైన ఉందన్నారు . కోవిడ్ సంక్షోభం నుంచి రిటైల్ వ్యాపారులకు చేయూత అందించడం కోసం ప్రభుత్వం ప్రారంభించిన క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ ప్రైజెస్ ( సీజీటీఎంఎస్ఈ పథకం ఆహ్వానించదగ్గ విషయమన్నారు . కోవిడతో నష్టపోతున్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను సీజీటీఎంఎస్ఈ పథకంలో చేర్చాలని , లేదంటే బ్యాంకుల నుంచి ఇదే పథకంలో ప్రైవేటు యాజమాన్యాలకు రుణాలను అందించాలని ఎంపీ నామ ఆర్ధిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ కు రాసిన ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.